కోవెలకుంట్ల, ఆగస్టు 6(తెలుగు పత్రిక ప్రతినిధి): యజమానిని కొట్టి, ఆటో అపహరించిన కేసులో ముగ్గురి నిందితులకు కర్నూలు |జిల్లా కోవెలకుంట్ల న్యాయస్థానం | మూడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించినట్లు రేవనూరు పోలీసులు తెలిపారు. పోలీసుల |వివరాల మేరకు కత్తి మల్లికార్జున(పులివెందుల), కంచి అమర్ నాథ్ (మైదుకూరు), కత్తి బాలగుర్రప్ప (కడప) అనే ముగ్గురు |వ్యక్తులు నంద్యాలలో కొట్టం జయరాజు అనే వ్యక్తి ఆటోను అద్దెకు మాట్లాడుకుని కోవెలకుంట్ల |వైషు బయలుదేరారు. మండలంలోని కలుగొట్ల గ్రామానికి చేరుకోగానే ఆటో యజమానిని కొట్టి రూ. 60 వేల |విలువైన ఆటోను తీసుకుని వెళ్లారు. ఈ ఘటనపై 2013లో రేవనూరు పోలీసు స్టేషన్లో ఎస్సై విజయభాస్కర్ కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితులకు |జైలుశిక్షతో పాటు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులకు జైలుశిక్ష, జరిమానా