శ్రీ చైతన్య , నారాయణ కాలేజీల దిష్టిబొమలదహనం

హైదరాబాద్ ఆగస్టు 6(తెలుగుపత్రిక ప్రతినిధి):నగరంలోని నాగోల్ చౌరస్తాలో గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ నాయకులు నారాయణ , చైతన్య కాలేజీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఈ కార్పొరేట్ కాలేజీలు ఉండవనుకున్నామని, కానీ విచ్చలవిడిగా. ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కాలేజీలు కొనసాగడం తెలంగాణ అమరవీరులను, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అవమానించడమేనాని అన్నారు. ఈ కాలేజీలకు వ్యతిరేకంగా గిరిజన శక్తి తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని శరత్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో రంజిత్ నాయక్, భరత్, దశ్రు నాయక్, లచ్చు నాయక్, శ్రీనునాయక్, మహేందర్, భాస్కర్ పాల్గొన్నారు.