ముంబయి(తెలుగుపత్రిక ప్రతినిధి): కంపెనీల దివాల కేసులను పరిష్కరించే నేషనల్ కం పెనీ లా ట్రైబ్యూనల్ (ఎనసీఎల్టీ) పని తీరును మరింత మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. కంపెనీ దివాల పిటిషన్లను సమయం ప్రకారం ముగించడానికి బాధ్యత వహించేలా ఎన్సీఎల్టీ నిబంధనలు తయారు చేయాలని కేంద్ర సుప్రీంను కోరింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్చిన దివాలా స్మృతి (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్టసీ కోడ్- ఐబీసీ) ప్రకారం ఈ కేసు అన్ని దివాల కేసులను, న్యాయ చిక్కులను 330 రోజుల్లో పరిష్కరించాల్సి ఉ ంది. ఈ బిల్లు పార్లమెంట్ లో పాస్ కావడంతో ఎన్ సీ ఎల్టీ సమయానుకూలంగా పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కార్పొరేట్ మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధనలను సుప్రీంకోర్టుకు ప్రతిపాదనల రూపంలో పంపింది. దీనిపై మాజీ న్యాయమూర్తి జీఎస్ సంఘ్వీ మాట్లాడుతూ 'గతంలో ఎన్నడూ లేని విధంగా కోర్టులకు గడువు విధించారు. ప్రభుత్వం ఆలస్యానికి కారణాలను అర్థం చేసుకోవాల్సి ఉంది.' అని అన్నారు. సర్కారు దివాలా స్కృతిలో కోర్టులకు కాలపరిమితిని విధించడంపై న్యాయ వ్యవస్థ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కోర్టులకు ప్రభుత్వం కాలపరిమితిని విధించడంతో ప్రభుత్వం న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిచడం సరికాదని ఆక్షేపిస్తున్నారు.
ఎన్సీఎల్టీని బలోపేతం చేయండి